Tuesday, 3 November 2026

బంగారం అపహరణ

పశ్చిమగోదావరి : దొంగతనాల నివారణకు పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా…. చోరీలు మాత్రం ఆగడం లేదు. జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట చోరీ జరుగుతూనే ఉంది. చోరీ జరిగిన తర్వాత పోలీసులు రావడం కేసులు నమోదు చేయడం తప్పితే రాత్రిపూట పెట్రోలింగ్ చేయడం, గస్తీ నిర్వహించడం వంటివి చేయకపోవడంతో చోరులు తమ పనిని తాపీగా చేసుకుని వెళుతున్నారు. జిల్లాలోని ఉంగుటూరులో శనివారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ సందర్బంగా 40 కాసుల బంగారంతోపాటు రూ. 10 వేలను దొంగలు అపహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *