బక్రీదు సందర్భంగా రేపు ప్రభుత్వ సెలవు
నెల్లూరు , బక్రీదు పర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని సంయుక్త కార్మిక కమిషనర్ ఇన్‌చార్జి మేన వరహాలరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని దుకాణాలు, పరిశ్రమలను ఆ రోజు తప్పని సరిగా మూసి వేయాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.