గుంటూరు : బాపట్ల నియోజకవర్గ వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో మహిళా నగారా పేరిట రాష్ట్రస్థాయి మహిళా సదస్సు నిర్వహణకు ముందు పార్టీ నేతల్లో అసంతృప్తి బయటపడ్డింది. బాపట్ల నియోజకవర్గ ఇంఛార్జి గోపాల్‌రెడ్డి ఎదుట బసవపున్నారెడ్డి వర్గీయులు నిరసనకు దిగారు. తమకు పార్టీలో గుర్తింపు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ దిష్టిబొమ్మ తగలబెట్టిన కోనా రఘుపతికి పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పదవి ఇవ్వడంపై అగ్రహం వ్యక్తం చేశారు. కోనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరోజు సాయంత్రం బాపట్ల అర్ట్స్ సైన్స్ కళాశాల మైదానంలో మహిళా నగారా జరగనుంది.




