Tuesday, 3 November 2026

బాబు ర్యాలీకి జనవాహిని స్వాగతం

విశాఖపట్నం, జనంసాక్షి: వస్తున్నా మీకోసం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా విశాఖ కూర్మన్న పాలెం వద్ద నిర్మించిన చారిత్రక విజయస్థూపం పైలాన్‌ను శనివారం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం వేలాది వాహనాల మధ్య ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం వద్దకు ఓపెన్‌ టావ్‌ వాహనంపై ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా దారిపొడవునా విశాఖ ప్రజలు చంద్రబాబుకు నీరాజనం పలికారు. ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌, బాలకృష్ణ, తారకరత్నలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన సీనియర్‌ నాయకులు ప్రజాప్రతినిధులు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.&ƒ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *