Tuesday, 3 November 2026

బాలికపై కిరాతకం

బాలికపై కిరాతకం
 లైంగిక దాడి చేసి మర్మాంగాలపై యాసిడ్ పోసిన కామాంధులు

చందర్లపాడు(కృష్ణా): కృష్ణాజిల్లా చందర్లపాటు మండలంలోని విభరింతలపాడు గ్రామ సమీపంలోని పొలాల్లో ఓ బాలిక అత్యంత పాశవికంగా హత్యకు గురైంది.   ఏటూరు గ్రామానికి చెందిన రేపాకుల శ్రావణి (16) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటకు వెళ్లి సాయంత్రమైనా రాకపోవడంతో కుటుంబసభ్యులు  వెతికారు. సోమవారం ఉదయం సపోటాతోట పరిసర ప్రాంతాల్లో వెతుకుతుండగా విభరింతలపాడు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు (ఒకరు మైనర్) గ్రామ సమీపంలోని సుబాబుల్ తోటల్లో తారసపడ్డారు.

యువకులను నిర్బంధించి శ్రావణి జాడ తెలపాలంటూ నిలదీయడంతో  వారిని ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. అక్కడ శ్రావణిపై లైంగికదాడి చేయడంతోపాటు గుర్తుపట్టకుండా నోట్లో, మర్మావయాలపై యాసిడ్ పోసిన ఆనవాళ్లు కనిపించాయి. తర్వాత చున్నీతో పత్తిచేలోని వేపచెట్టుకు ఉరివేసినట్లు తెలుస్తోంది. శ్రావణి కూలి పనులకు వెళ్తుంటుంది. నందిగామ డీఎస్పీ  ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *