ప్రకాశం: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లె శివార్లలో మూడేళ్లబాలుడు హర్షిత్‌రెడ్డి కిడ్నాపర్ల చేతిలో హత్యకు గురయ్యాడు. అగ్రహించిన బంధువులు నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. దీంతో మార్కాపురం వద్ద రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.




