Tuesday, 3 November 2026

బ్రహ్మణి పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశారు

నారాయణ

కడప : జిల్లాలో బ్రహ్మణిని రద్దు చేసి దాని స్థానంలో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కడప జిల్లాలో బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని నారాయణ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గాలి జనార్ధన్‌రెడ్డి, వైఎస్‌ కుమ్ముక్కె బ్రహ్మణి పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. గాలి జనార్దన్‌రెడ్డి అత్యాశకుపోయి, బ్రహ్మణి పరిశ్రమను నెలకొల్పి జైలు పాలయ్యారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *