అవుకు (కర్నూలు): అవుకు మండల కేంద్రంలోని చిన్నపురెడ్డి కాలనీకి చెందిన నరసింహుడు (28) ఈరోజు ఉదయం హత్యకు గురయ్యాడు. అతని భార్యే హత్యచేసి అత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు. మరణించిన వ్యక్తి మెడకు తాడువేసి దూలానికి వేలాడదీసి ఉంది. అతని భార్య ప్రస్తుతం పరారీలో ఉంది. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నరసింహడు ట్రాన్స్‌కోలో సహాయ లైన్‌మెస్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.




