Tuesday, 3 November 2026

భర్త ఎదుటే మహిళ కన్నుమూత

రేపల్లె : కళ్ల ముందు తన భార్య ఊపిరి ఆగిపోతుంటే… ఆ భర్త తల్లడిలిన వైనం వర్ణనాతీతం. తన సహచరి ప్రాణాలను నిలపలేని అసహాయ స్థితిలో అతడు మ్రాన్పడిపోగా… . కేవలం ఐదు నిముషాల వ్యవధిలో ఆమె అచేతనంగా మారిపోయింది. ఎందరినో కలచివేసిన ఈ విషాద ఘటన సోమవారం తెనాలి నుంచి రేపల్లె వస్తున్న పాసింజర్‌ రైలులో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం, కృష్ణాజిల్లా మోపిదేవి మండలం శివరామపురానికి చెందిన రావి ప్రభు ప్రసాద్‌ భార్య రావి శివనాగేంద్రం (52) ఆరోగ్యం బాగోలేదు. రెండు రోజుల కిందట తె నాలిలోని తమ కుమార్తె ఇంటికి దంపతులిద్దరూ వచ్చారు. అక్కడి వైద్యశాలలో శివనాగేంద్రానికి చికిత్స చేయించారు. సోమవారం తెనాలిలో రేపల్లెకు ప్యాసింజర్‌ రైలులో బయలుదేరారు. పల్లెకోన స్టేషన్‌కు చేరుకునే సరికి ఆమెకు గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే ఆసుపత్రితకి తరలించే అవకాశం లేకపోవటంతో… మరో ఐదు నిముషాల్లో రేపల్లెకు చేరుతామని భార్యను ప్రభు ప్రసాద్‌ సముదాయించాడు. వెంటనే 108కు సమాచారం అందించాడు. ఐతే రేపల్లె స్టేషన్‌లో పరీక్షించిన 108 సిబ్బంది అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. కళ్ళ ముందే చనిపోతున్న భార్యను కాపాడుకోలేక పోయానని ప్రభు ప్రసాద్‌ రోధించిన తీరు స్థానికులకు కలచి వేసింది. ఏఎ్‌సఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *