గుంటూరు గ్రామీణం : నగర శివారు గోరంట్ల హిమనినగర్ ప్రాంతానికి చెందిన పిల్లి లక్షి(30) అనే మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త థామస్ ఆమెను గొంతునులిమి హత్యచేశాడు. అనంతరం నిందితుడు నల్లపాడు పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.




