గుంటూరు,ఫిబ్రవరి25(జనంసాక్షి): భూ సేకరణలో రైతుకు పరిహారం ఒకసారే లభిస్తుందని, అదే భూ సవిూకరణలో రైతులు అభివృద్ధి చేసిన భూములు పొందడమే కాకుండా, రాజధాని నిర్మాణంలో ప్రతీ రైతు భాగస్వామి అవుతారని మంత్రి నారాయణ చెప్పారు. రైతులను భాగస్వాములను చేయాలనే భూ సవిూకరణ చేస్తున్నామని అన్నారు. నిర్మాణ పనులు, ఇతర కాంట్రాక్టుల్లో భూ సవిూకరణకు సహకరించిన వారికి ప్రాధాన్యం ఉంటుందని, రాజకీయం చేసే పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. రైతులు ఆలోచించుకోవాలని సూచించారు. అయితే ఈ విధానం కూడా సక్రమమైంది కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏదైనా పరిశ్రమ, ప్రాజెక్టుకు భూమిని తీసుకునేప్పుడు ఒకే విధానాన్ని అనుసరించాలని, కొంత విస్తీర్ణానికి సవిూకరణ, మిగిలిన విస్తీర్ణానికి సేకరణ చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయని, రాజధాని నిర్మాణానికి భూమిని తీసుకునేప్పుడు ఒకే విధానాన్ని అనుసరించాలని చెబుతున్నారు. కొంత భూ సవిూకరణ, మరి కొంత సేకరణ చేస్తే రైతులకు కలిగే ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయని, ఈ విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తే చట్టపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు సేకరించిన 24,200 ఎకరాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు, రాజధాని నిర్మాణానికి పోను మిగిలిన భూమిని పరిశ్రమలకు విక్రయించి, ఆ వచ్చిన మొత్తాన్ని భూ సేకరణకు వినియోగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వినపడుతోంది. ఈ విధానాల ద్వారా రైతులకు నష్టం కలిగిస్తున్న చంద్రబాబుకు చట్టపరంగా భవిష్యత్‌లో చిక్కులు తప్పవని న్యాయవాదులు చెబుతున్నారు.




