తూర్పుగోదావరి జిల్లా : భూ సమస్యలపై జూన్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, పికెటింగ్‌లు నిర్వహించనున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు తెలిపారు. వైఎస్ హయాంలో ప్రభుత్వ భూ పంపిణీకి సంబంధించి చట్టాల్లో చేసిన సవరణలు రద్దుచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల నుంచి కాకుండా సాధారణ బడ్జెట్ నుంచి గృహరుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జూన్ 17,18 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల సమస్యలపై అధ్యయనం చేయనున్నట్లు రాఘవులు తెలిపారు.




