సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. గట్టి బందోబస్తు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కిన్హౌర్ జిల్లాలోని మండి పార్లమెంటు పరిధిలోని మరికొన్ని ప్రాంతాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటి వరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఎన్నికల ముఖ్య అధికారి నరిందర్ చౌహన్ తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్, భాజపాల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. హిమాచల్ ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్రసింగ్ 2012 డిసెంబర్‌లో అసెంబ్లీకి ఎన్నికవడంతో మండి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్నున్నారు.




