Thursday, 5 November 2026

మంత్రాలయంలో ఘనంగా గురుభక్తి ఉత్సవాలు

కర్నూలు,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)
:  ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురుభక్తి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామి 394వ పట్టాభిషేక మ¬త్సవం కన్నులపండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చరణలు, భక్తుల నామస్మరణల మధ్య స్వామివారి పాదుకులకు పీఠాధిపతి పుష్పాలు, నాణెళిలు, ముత్యాలతో అభిషేకం జరిపించారు. అనంతరం భక్తులకు పాదుకుల దర్శనం కల్పించారు. ప్రాకారంలో నవరత్ర రథంపై పాదుకులను ఉంచి వేలాది మంది భక్తుల నడుమ రథోత్సం నిర్వహించారు. రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి విశేష ఫలపంచామృతాభిషేకాలు, అలంకరణలు, పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *