విజయవాడ, (మార్చి, 11): అవయవదాత మణికంఠ కుటుంబాన్ని సినీనటుడు శివాజి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మణికంఠ కుటుంబానికి ఆయన రూ.లక్ష చెక్కు అందజేశారు. అనంతరం శివాజి మాట్లాడుతూ.. మణికంఠ కుటుంబ సభ్యుల నిర్ణయం ఎంతో మందికి ఆదర్శమన్నారు. ఇక మీదట ప్రతిఏడాది ఆయన కుటుంబానికి లక్ష రూపాయలు అందజేస్తానని చెప్పారు.




