తిరుమల : గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంలో , కేంద్రంలో బాగా పనిచేసిందన్నారు. అందుకే రాష్ట్రంలో ఇద్దరు కళంకిత మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారని, మరో ముగ్గురిపై కూడా చర్యలు తప్పవని చెప్పారు.




