Tuesday, 3 November 2026

మహిళా మావోయిస్టు అరెస్ట్‌

గుంటూరు: 23ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్న మహిళా మావోయిస్టు అన్నపూర్ణ అలియాస్‌ పద్మ, అలియాస్‌ జ్యోతిని గుంటూరు గ్రామీణ పోలీసులు ఈరోజు అరెస్ట్‌ చేశారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని సోదరి ఇంటి వద్ద వైద్యం చేయించుకునేందుకు అన్నపూర్ణ వచ్చిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆమె స్వస్థలం పిడుగురాళ్ల మండలం జూలకల్లు.

దండకారణ్య స్పెషల్‌ జోన్‌లో సీనియర్‌ కమాండర్‌ నూనె నరసింహారెడ్డి భార్య అయిన అన్నపూర్ణ… డిప్యూటీ కమాండర్‌ స్థాయి వరకు వివిధ విభాగాల్లో పనిచేసింది. బండ్లమోటు వద్ద పోలీసులను హతమార్చిన ఘటనలో ఆమెపై కేసు నమోదైంది. అన్నపూర్ణపై ప్రభుత్వం రూ.5 రివార్డు ప్రకటించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *