పరిగి, జనంసాక్షి: అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలో పరిగి ఎస్సీ కాలనీలో భీమప్ప అనే వ్యక్తి లక్ష్మమ్మ (40) అనే మహిళపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్యచేశాడు. అనంతరం అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. భీమప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లక్ష్మమ్మ భర్తను వదిలేసి పరిగిలో నివాసం ఉంటూ భీమప్పతో సహజీవనం సాగిస్తోంది. ఇటీవల ఇద్దరు మధ్యలో మనస్పర్ధలు పెరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.




