ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి కేసు వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆధ్వర్యంలో ఓ బృందం మారిషస్‌కు వెళ్లింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై మారిషస్ కోర్టులో నేడు విచారణ జరగనున్న నేపథ్యంలో కర్నూలు పోలీసు బృందం మారిషస్ వెళ్లడం విశేషం. ఎర్రచందనం స్మగ్లింగ్‌తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి చేసిన కేసులో నిందితుడైన గంగిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మారిషస్ నుంచి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.




