నెల్లూరు జిల్లా: మాజీ మావోయిస్టు, అమరవీరుల బంధుమిత్రల కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంటి ప్రసాద్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం నారాయణ ఆసుపత్రికి తరలించారు. విరసం సభకు హాజరై బంధువుల ఇంటికి వెళ్తున్న గంటి ప్రసాద్‌ను దుండగలు కత్తితో పొడిచి, మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.




