చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలి పట్టు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న కారు-లారీ ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని 108 సాయంతో క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు.




