ముక్కుసూటి అధికారి ఐజీ రవిగుప్త
గుంటూరు,నవంబర్22 : గుంటూరు రేంజ్ ఐజీగా నియమితులైన రవిగుప్తా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనువలసి ఉంది. రెండున్నరేళ్లుగా హైదరాబాద్‌లో ఎటువంటి ప్రాథాన్యత లేని కంప్యూటర్స్ అండ్ స్టేషనరి విభాగంలో కొనసాగటం గమనార్హం.ఈ క్రమంలో ఐజీగా రేంజ్‌కు కేటాయించటం ఇదే ప్రథమం. అందులోనూ రాజకీయ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గుం టూరు రేంజ్‌కు నియమితులైన రవిగుప్తా ఎంత వరకు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారనేది వేచి చూడాల్సిందే. ముఖ్యంగా సీఐల బదిలీల్లో అవకతవలకు పాల్పడినట్లు- ఆరోపణలు ఎదుర్కొన్న ఐజీ హరీష్‌కుమార్ గుప్తాను బదిలీ చేసి ఆ స్థానంలో రవిగుప్తాను నియమించా రు. ఇప్పటికే రేంజ్‌లో పోలీస్ వ్యవస్థ, అనేక సవాళ్లను ఎదుర్కొంటు-ంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పోలీస్ యం త్రాంగం నడుస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో బాధ్యతలు స్వీకరించనున్న ఐజి రవిగుప్తా ఎంత వరకు వాటిని సంస్కరిస్తారో వేచి చూడాల్సిందే. ఎంటెక్ చదివిన ఆయన 1990లో ఆంధ్రా క్యాడర్ ఐపిఎస్ గా ఎంపికయ్యారు. ఆయన ఎస్పీగా నల్గొండ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పని చేశారు. ఏసీబీ, ఇంటిలిజన్స్ విభాగాల్లోనూ ఎస్పీగా పని చేశారు. తిరుపతి లో విజిలెన్స్ విభాగంలోనూ విధులు నిర్వహించారు. 2004లో డీఐజీగా పదోన్నతి పొందారు. వరంగల్, ఏలూరు రేంజ్ డీఐజీగా పని చేశారు. 2008లో ఐజీగా పదోన్నతి పొందారు. ఏడాది పాటు ఏపీఎస్పీ ఐజీగా విధులు నిర్వహించారురెండున్నరేళ్లుగా హైదరాబాద్ సిటిలో కంప్యూటర్స్ అండ్ స్టేషనరి విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. 21 సంవత్సరాలు దాటినా తన సర్వీస్‌లో ఎక్కువ కాలం ఆయన లూప్‌లైన్‌లోనే పని చేశారు. ఎస్పీగా నల్గొండ, పశ్చిమ గోదావరి, డి ఐజిగా వరంగల్, ఏలూరులలో పని చేశారు. అది కూడా కొద్ది కాలమే విధులు నిర్వహించారు. ఎక్కువగా ఏసీబీ, ఇంటిలిజెన్స్, విజిలెన్స్, ఎపిఎస్‌పి, కంప్యూటర్స్ తదితర అప్రాథాన్యత విభాగాల్లోనే ఎక్కువ కాలం కొనసాగారు. విధి నిర్వహణలో ముక్కు సూటిగా వ్యవహరించటంతో పాటు- వివాద రహితుడిగా పేరుతెచ్చుకున్నారు.



