Wednesday, 4 November 2026

మేలో గోదావరి ప్రక్షాళన: మున్సిపల్‌ సెక్రటరీ

తూర్పుగోదావరి, మార్చి 5: గోదావరి పుష్కరాల కోసం మే నెలలో గోదావరిలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగిస్తామని ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జేవీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. రాజమండ్రిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రసాద్‌ ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 4 లేదా 9 తేదీల్లో ముఖ్యమంత్రి పర్యటించే అవకాశం ఉందని, పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల్లో శానిటేషన్‌, మంచినీటి సౌకర్యం, తదితర మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం హైస్పీడ్‌ బోటులతో పాటు ఎమర్జెన్సీ హెలీకాప్టర్‌ను కూడా సిద్ధంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. గోదావరి ప్రక్షాళనను ఓ ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *