Wednesday, 4 November 2026

విశాఖలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థత

విశాఖపట్నం, మార్చి 5: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మధ్యాహ్న భోజన పథకం. అయితే భోజనం తయారు చేసే ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటిస్తోంది. తాజాగా మధ్యాహ్న భోజనం వికటించి ముగ్గురు విద్యార్థులు అస్వస్థత చెందారు. జిల్లాలోని గోలుగొండ మండలం, ఏఎల్‌పురం పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థులు అస్వస్థత చెందడంతో వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *