Tuesday, 3 November 2026

యాక్ట్‌’ ప్రసారాలు పునఃప్రారంభం

నెల్లూరు – సాంస్కృతికం : స్థానిక చానెల్‌ యాక్ట్‌ 247 ప్రసారాలు మంగళవారం రాత్రి 7.30 నిమిషాల బులిటెన్‌తో పునఃప్రారంభమయ్యాయి. వారం రోజులుగా యాక్ట్‌ చానెల్‌ ప్రసారాలు నిలిపి వేసిన సంగతి విదితమే. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు యాక్ట్‌ చానెల్‌ ప్రసారాలు పునఃప్రారంభిస్తున్నామని యాక్ట్‌ గ్రూప్‌ సంస్థల ఇన్‌చార్జి బీవీ సుబ్బారావు తెలిపారు. సమాచారాన్ని తెలియజేసే వారు న్యూస్‌ సెంటర్‌కు 0861- 2301295, 97 నెంబర్లకు ఫోన్‌ చేస్తే వారి కాల్స్‌ రికార్డు అవుతాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *