యువతిని నిర్బంధించి వ్యభిచారం
జయవాడ, ఆగస్టు 19 : పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువతిని విజయవాడలో నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయించిన సంఘటన జరిగింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి ఓ యువతిని పింకీ అనే మహిళ తీసుకువచ్చి పెనమలూరు మండలం మురళీనగర్ వాసి సురేష్‌కు అప్పగించింది. సురేష్ ఆ యువతితో వ్యభిచారం చేయించాడని వెల్లడైంది. వ్యభిచారగృహం నుంచి తప్పించుకున్న బెంగాల్ యువతి కృష్ణలంక పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసింది. సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.