విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికితోడు వాయువ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు చోట్ల , రాయలసీమలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.




