విశాఖపట్నం, జనంసాక్షి: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి రాయలసీమ వరకు ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీనికి తోడు సాయంత్రానికి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశముందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులతో కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్యుములోనింబస్ మేఘాల వల్ల బలమైన ఈదురుగాలులు, వడగళ్ల వానలు సైతం కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు.




