విశాఖపట్టణం : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తా జిల్లాల్లో అకాశం మేఘామృతమై ఉంటుంది. కోస్తాంధ్ర , రాయలసీమల్లో 1,2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.




