విశాఖపట్నం : రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.




