తూ.గో:గోదావరి పుష్కరాల సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు రాజమండ్రి పరిసరాల్లో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 500మంది ఎక్సైజ్ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. 20 లంకగ్రామాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా సారా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 33మందిని అరెస్ట్ చేశారు.




