అనంతపురం,మార్చి26 (జనంసాక్షి) : గార్లదిన్నెలో ఈనెల 29వ తేదీన జిల్లా స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనే ఎద్దుల యజమానులు ముందుగానే వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా రూ.15 వేలు , ద్వితీయ బహుమతిగా 7,500 తృతీయ బహుమతి రూ.3516 అందజేయనున్నట్లు వివరించారు. ఇక మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో శ్రీ రామనవమి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి ఇసుక ఎత్తే పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.12 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.6 వేలు, తృతీయ బహుమతిగా రూ.3 వేలు బహూకరించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న యువకులు పాల్గొనాలని కోరారు.




