విశాఖ: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విధర్బ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంద్ర, రాయలసీమ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కోనసాగుతుంది. దీనికి తోడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం వుంది.వీటి ప్రభావం వల్ల దక్షిణ కోస్తాలో పలుచోట్ల ,ఉత్తరకోస్తా,తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్యుయులోనింబస్ మేఘాల ప్రభావం వల్ల బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు సైతం పడే అవకాశం ఉందని పంట పోలాల్లో పనులు చేసుకోనే రైతులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.




