విశాఖ: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని వివరించారు. గడచిన 24 గంటల్లో గన్నవరంలో 9, బాపట్ల, నెల్లూరులో 8,విశాఖపట్నం, మచిలీపట్నంలో 6, నర్సాపూర్‌లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.




