Monday, 2 November 2026

రుణమాఫీ పూర్తిగా చేయాల్సిందే

అనంతపురం,మే4(జ‌నంసాక్షి): ఎన్నికల ముందు టిడిపి మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హావిూలను వెంటనే అమలు చేయాలని  సిపిఐ కార్యదర్శి జగదీశ్‌ డిమాండు చేశారు.  రుణాలను మాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని  హెచ్చరించారు. జిల్లాల్లోని రైతులకు తక్షణం పంట రుణాలివ్వాలని, డ్వాక్రా, చేనేత రుణాలను వెంటనే మాఫీ చేసి, వారిని ఆదుకోవాలని డిమాండు చేశారు.  రైతుల రుణమాఫీ,పాత రుణాలు మాఫీ కాకపోవటం, కొత్తరుణాలు అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు పొంతనలేని ప్రకటనలు ఇస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బ్యాంకుల మొడి వైఖరి కారణంగానే తాము ఆందోళన చేశామన్నారు.  రైతుల వ్యవసాయ రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. సీజన్‌ ప్రారంభమైనా… రైతులకు కొత్త రుణాలు ఇవ్వలేదన్నారు. అనంత జిల్లాలో పారిశ్రామిక, ఐటీ, విద్యా తదితర రంగాలను అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *