పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి రాజమండ్రి వెళ్లే ఏడీబీ రహదారిలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. కాకినాడ నుంచి వస్తున్న కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న ప్రైవేటు టూరిస్ట్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.




