రవీంద్రనాధ్‌కు మద్దతు ప్రకటించిన మైసారా వ్యాఖ్య
కడప,మార్చి2(జనంసాక్షి): బడ్జెట్‌లో ఎపికి అన్యాయం జరిగినప్పుడు కేంద్ర కేబినేట్లో ఇంకా ఎందుకు కొనాసగాలని వైకాపా నేత ఎంవి మైసారా రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. అన్యాయం జరిగిన్పుడు నిలదీయాల్సిందేనన్నారు. రాష్టాన్రికి న్యాయం జరగనప్పుడు బిజెపితో ఎందుకు చెట్టపట్టాల్ వేసుకుని తిరగాలని అన్నారు. రెక్కలు విరిచారంటున్న చంద్రబాబు… కేంద్ర కేబినెట్ లో తమ పార్టీ తరఫున మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. పట్టిసీమ కోసమే చంద్రబాబు, బీజేపీ ప్రభుత్వాలు కుమ్మక్కై పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నాయని మైసూరారెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో పోలవరానికి కేవలం రూ.100 కోట్లు కేటాయించడంపై అనుమానాలున్నాయని అన్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయాలన్న డిమాండ్ తో కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్షకు మైసూరారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాయలసీమకు నీరు తరలించుకుపోతున్నారని గతంలో దేవినేని ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఈరోజు గండికోటకు జూలైలోగా నీరందిస్తామంటే ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. సర్కారుకు అంత చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం నీటిని ఎందుకు వృధాగా కిందికి వదిలారని అన్నారు. ఇదిలావుంటే కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలన్న డిమాండ్‌తో వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు. సీఎం చంద్రబాబు మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైందని ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు.. రబీ సీజన్ కూడా మోసం చేసింది.. చంద్రబాబు సీఎం అయితే ఆయనతో పాటు కరువు కూడా వస్తుందని నిరూపించారు. ఇలాంటి సమయంలో చేతులు కట్టుకొని ఉండకూడదనుకున్నాను.. ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. గాలేరు-నగరి, సర్వరాయసాగర్ పనులు తక్షణం పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలని అన్నారు. సాగు, తాగునీటికోసం తాను చేపట్టిన ఈ పోరాటం అంతం కాదని.. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. నిరవధిక నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హావిూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా, రైతు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో అయితే వాగ్ధానాలు ఇచ్చి అమలు చేయకపోతే ఉరిశిక్ష విధిస్తారని, గల్ఫ్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారని, అలాంటి చట్టాలు ఇండియాలో లేకనే చంద్రబాబును ప్రజలు వదిలేశారని స్పష్టం చేశారు. రవీంద్రనాథ్‌రెడ్డి నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు పలువురు నాయకులు వచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు ఎం.వి మైసూరారెడ్డితో పాటు సీపీఐ నేత నారాయణ, కార్మిక నాయకుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి తదితరులు హాజరవుతారని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి తెలిపారు.




