Tuesday, 3 November 2026

రేపటి నుంచి పురందేశ్వరి జిల్లా పర్యటన

చిత్తూరు, :  కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురందేశ్వరి శుక్ర, శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో ఆమె జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై జరిగే అవగాహన సదస్సుల్లో పాల్గొననున్నారు. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాటి నుంచి పురందేశ్వరి జిల్లాతో అనుబంధం పెంచుకున్నారు. మహా సంపర్క్‌ అభియాన్‌ రాష్ట్ర కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఆమె శుక్రవారం ఉదయం తిరుపతిలో ని ఎల్వీ రెసిడెన్సీ, మధ్యాహ్నం చిత్తూరు విజయదుర్గ కల్యాణమండపం, 26న ఉదయం పుంగనూరు గోకుల్‌ కల్యాణమండపం, మధ్యాహ్నం పలమనేరులో జరిగే సదస్సుల్లో పాల్గొననున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాలను వివరించి, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *