Thursday, 5 November 2026

రేపు ’108’లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

గుంటూరు (మెడికల్‌): 108 ఆంబులెన్స్‌ వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈంటీ), పైలెట్‌ (డ్రైవర్‌) పోస్టుల ఎంపిక కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అక్టోబర్‌ 15వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి ఎంపిక కార్యక్రమం జరుగుతుందని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమర్జెన్సీ మెడికల్‌ టె క్నీషియన్‌ పోస్టు కోసం అభ్యర్థులు లైఫ్‌ సైన్స్‌లో డిగ్రీ చేసి ఉండాలన్నారు. ఇక పైలెట్‌ పోస్టుల కోసం వచ్చే అభ్యర్థులు డ్రైవర్‌గా మూడేళ్ల అనుభవంతో పాటు హెవీ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని ఆయన సూచించారు. అర్హులైన ఆసక్తి ఉన్న అభ్యర్థులు గురువారం ఉదయం 9 గంటలకు తమ ఒరిజినల్‌ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో గుంటూరులోని డీఎంహెచ్‌వో కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌కు రావాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *