Tuesday, 3 November 2026

రైతుపై పోలీసుల దాడి

విశాఖపట్నం : వసూలు డబ్బులు ఇవ్వలేదని ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గత అర్థరాత్రి శ్రీకాకుళం జిల్లా నుంచి తూగో జిల్లాకు వరికోత మిషన్ తీసుకువెళ్తున్న రైతు రాంబాబుపై ఈ దాడి జరిగింది. వరికోత మిషన్‌ను తీసుకువెళ్తుండగా హైవేపై లారీని ఆపిన కానిస్టేబుళ్లు డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే రైతు డబ్బు ఇవ్వకపోవడంతో రికార్డులు చూపించాలన్నారు. ఇందుకు రైతు ససేమిరా అనడంతో రెచ్చిపోయిన పోలీసులు అతడిపై దాడి చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మిగిలిన రైతులు ఈ ఘటనపై అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *