Tuesday, 3 November 2026

రైతు బజార్లలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

విశాఖపట్నం (ఎంవీపీ కాలనీ): రైతు బజార్ల పనితీరును పరిశీలించేందుకు, దళారులను నివారించేందుకు విజిలెన్స్‌ అండ్‌, ఎస్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల శనివారం రైతు బజార్లల్లో దాడులు నిర్వహించారు. ఎంవీపీ కాలనీ, సీతమ్మధార రైతు బజార్లలో తనిఖీలు చేపట్టారు. రైతు బజార్లకు అసలైన రైతులు వస్తున్నారా లేదా అనే విషయంపై అరా తీశారు. రూ. 99లకే 9 రకాల కూరగాయలను ఇచ్చే పథకంపై కూడా ప్రజల నుంచి వివరాలు సేకరించారు. విజిలెన్స్‌ డీఎస్పీ ఎస్‌. రమేశ్‌ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ దాడుల్లో తూనికలు-కొలతలు, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *