Tuesday, 3 November 2026

రేపు తిరుమలలో వీఐపీ విరామ దర్శనం రద్దు

తిరుపతి : తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శనం రద్దు చేస్తున్నట్లు తితిదే జేఈవో ప్రకటించారు. మరోవైపు అలిపిరి, శ్రీవారిపాదాల కాలినడకన మార్గంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వైకుంఠం -1లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూలో వేలాది మంది వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన భక్తులకు 11 గంటలు, ప్రత్యేక దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *