విశాఖ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయం తప్పక విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా నగరానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్‌డీఏ ప్రభుత్వం ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని, దేశ ప్రజలకు మంచి పాలనను అందిస్తుందన్నారు.




