తణుకు, పేకేరు: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామంలో విదేశాలకు పంపిస్తామని చెప్పి సుమారు 60 మంది నిరుద్యోగుల నుంచి రూ. కోటికి పైగా డబ్బు వసూలు చేసి ఉడాయించిన ఘటన గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పులుపు పద్మావతి, అల్లుడు చిత్తూరు శ్రీనివాస్‌రావుతో కలిసి ఆప్ఘనిస్తాన్ పంపిస్తామన చెప్పి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. లక్ష నుంచి రూ. 2లక్షల వరకూ వసూలు చేశారు. ఐదు నెలల క్రితం కొంత మందిని దుబాయ్ తీసుకెళ్లి అక్కడే మూడు నెలలు ఉంచి తిరిగి గ్రామానికి పంపించారు. దీంతో బాధితులు పద్మావతి ఇంటి ముందు ఈరోజు అందోళనకు దిగారు. తమ డబ్బులను చెల్లించాలని వారు డిమాండ్ చేయడంతో పద్మావతి, ఆమె అల్లుడు పరారయ్యారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.




