విద్యార్థులకు నాసిరకభోజనం పెడితే సహించేదిలేదు: మంత్రి సునీత
అనంతపురం, ఆగస్టు13: కుటాగుళ్ల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. పుష్టికరమైన, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులకు నాసిరకభోజనం పెడితే సహించేదిలేదన్నారు. ప్రభుత్వ హాస్టళ్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు