పెళ్లకూరు : నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని తాల్వాయిపాడులో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికంగా ఉన్న ఓ ఇటుకల తయారీ కేంద్రంలో రజనీ (35) అనే వ్యక్తి నీటి గుంటలో దిగి విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే అతన్ని ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెల్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. విద్యుత్ తీగలు తెగి నీటి గుంటలో పడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు.




