Thursday, 5 November 2026

విద్యుధ్ఘాతానికి రైతు మృతి

అనంతపురం: వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి ప్రయత్నించిన రైతు ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రామగిరి మండలం కంచుకుంట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కదిరప్ప(39) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *