Wednesday, 4 November 2026

విభజన సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు :సీపీఐ

అనంతపురం,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): ఆంధప్రదేశ్‌ విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక ¬దా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయిస్తామని చెప్పిన భాజపా ఇప్పటివరకు ఆ వూసే ఎత్తలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ తెలిపారు. ఛాయ్‌ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అయినందుకు సమస్యలు తీరుతాయనుకున్న పేదలకు నిరాశే మిగిలిందన్నారు. విభజన పక్రియ సమయంలో రాజ్యసభలో ఆంధప్రదేశ్‌ను అన్నివిధాల ఆదుకుంటామని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తే ఇతర రాష్టాల్రు అంగీకరించవంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఆరోపించారు. వెంకయ్యనాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి హావిూలను వెంటనే అమలు చేయించాలని డిమాండు చేశారు. పేదల కోసం ఇప్పటివరకు ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదన్నారు. అలా చేయించని పక్షంలో పదవి నుంచి వైదొలగాలని తెలిపారు. కదిరిలో జరిగిన సమావేవాల్లో పలు అంశాలను చర్చిస్తున్నామని అన్నారు. విభజన సమయంలో అన్యాయంగా విభజించారంటూ వాపోయిన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టి తొమ్మిది నెలలు కావస్తున్న విభజన సమయంలో ఇచ్చిన హావిూల విషయంలో గట్టిగా మాట్లాడలేకున్నారని విమర్శించారు. ప్రత్యేక ¬దా విషయమై విపక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తడి తెద్దామంటే అందుకు చంద్రబాబు సమ్మతించ లేదని చెప్పారు.అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కంటే కార్పొరేట్‌ దిగ్గజాలకు మేలు చేకూర్చడానికి ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. రిలయన్స్‌, అదాని వంటి పారిశ్రామిక వేత్తలకు రూ. వేల కోట్ల మేర దోచిపెడుతున్నారని ఆరోపించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నన ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 వామపక్షాల పార్టీలను కలుపుకుని ప్రజల తరపున పోరాటాలు ఉద్ధృతం చేస్తామని వివరించారు. ఇందులో భాగంగా మార్చి 3, 4, 5వ తేదీల్లో విజయవాడలో సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామన్నారు. ఉద్యమాలకు సంబంధించిన విధివిధానాలపై తీర్మానాలు చేస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *