Monday, 2 November 2026

విరసం నేత చలసాని ప్రసాద్‌ కన్నుమూత

విశాఖ, జూలై 25 : విరసం నేత చలసాని ప్రసాద్‌ (83) గుండెపోటుతో కన్నుమూశారు. విరసం వ్యవస్థాపక సభ్యుడైన ప్రసాద్‌ స్వస్థలం కృష్ణాజిల్లా పెనుమర్రు. చలసాని ప్రసాద్‌కు ఇద్దరు కుమార్తెలు. విప్లవ రచయితల సంఘం ఏర్పాటులో చలసాని కీలకపాత్ర పోషించారు. ప్రజా ఉద్యమాల అణిచివేతలపై జీవితకాలం పోరాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన ప్రసాద్‌ ఎన్నోసార్లు జైలు జీవితం గడిపారు. కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన ప్రసాద్‌ జీవితాంతం కమ్యూనిస్టుగా బతికారు. నిబద్ధత, అంకితభావం, అప్యాయతలకు చలసాని మారుపేరు. శ్రీశ్రీ, రంగనాయకమ్మలకు చలసాని అత్యంత సన్నిహితులు. ఆయన మృతి పట్ల విరసం సభ్యులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *