Wednesday, 4 November 2026

విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు

విశాఖ, జనంసాక్షి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ బి. శివధర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం2 గంటల రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లే భారీ వాహనాలు లంకెలపాలెం వద్ద ఆనందపురం వైపు , శోంఠ్యాం మీదుగా అడవివరం వచ్చే వాహనాలు హనుమంతవాక, జోడుగుళ్ల పాలెం వైపు, గాజువాక మీదుగా నగరంలోకి వచ్చే వాహనాలు షీలానగర్‌ వైపునకు దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *